Header Banner

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు.. ఏర్పాట్లపై టీటీడీ ఛైర్మన్ సమీక్ష! భక్తులకు సీఎం చంద్రబాబు ప్రత్యేక తలంబ్రాలు!

  Mon Mar 10, 2025 13:52        Devotional

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కడప జిల్లాలోని ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో పర్యటించారు. ఇక్కడి కోదండ రామాలయంలోని కల్యాణ వేదికను పరిశీలించారు. త్వరలో శ్రీరామనవమి వస్తున్న నేపథ్యంలో, కల్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. ఏప్రిల్ 5 నుంచి 15వ తేదీ వరకు ఒంటిమిట్ట రాముల వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. ఏప్రిల్ 11న సీతారాముల కల్యాణం ఉంటుందని తెలిపారు. ఒంటిమిట్ట రాముల వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు, ముత్యాలు, తలంట్రాలు అందజేస్తారని వివరించారు. సీతారాముల కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ముత్యాల తలంబ్రాలు అందజేస్తామని బీఆర్ నాయుడు వెల్లడించారు. శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణానికి భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల తాకిడికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాలన్నారు.


ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?


టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ మరియు పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం రోజున ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగ రాదని, అవసరమైన జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు, వేసవి నేపథ్యంలో అగ్ని మాపక శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆహ్వానం పత్రికలు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలని, భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుత్ అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని కోరారు. అత్యవసర వైద్య సేవలు, అవసరమైన మందులు నిల్వ ఉంచాలన్నారు. శాఖలవారీగా అధికారులు చేయనున్న పనులను ఛైర్మన్ కు నివేదించారు. అంతకు ముందు కల్యాణ వేదిక ప్రాంగణాన్ని టిటిడి ఛైర్మన్ అధికారులతో కలిసి పరిశీలించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 
80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ttd #brahmosthavalu #todaynews #latestnews